Farmers: ఢిల్లీలో ఉద్రిక్తత... ఎర్రకోటపైకి భారీగా చేరుకున్న రైతులు

  • ఎర్రకోటపై ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు
  • దూసుకొచ్చిన రైతులు
  • నినాదాలతో మార్మోగుతున్న ఎర్రకోట పరిసరాలు
  • ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, రైతులు
Farmers agitation at Red Fort in Delhi

కొన్ని గంటల కిందట భారత రిపబ్లిక్ వేడుకలతో మురిసిన ఎర్రకోట ఇప్పుడు రైతుల నిరసనలకు వేదికగా మారింది. నగరంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించుకుని మరీ ముందుకు ఉరికిన రైతులు కొద్దిసేపటి కిందట ఎర్రకోటపైకి చేరారు. రైతులు, రైతు సంఘాల నాయకుల నినాదాలతో ఎర్రకోట పరిసరాలు మార్మోగుతున్నాయి. రైతులు ఎర్రకోట ప్రాంగణంలో జెండా ఎగురవేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎర్రకోటపై ప్రధాని జెండా ఎగురవేసే స్తంభం నుంచే తమ జెండాను కూడా ఎగురవేశారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గణతంత్ర పరేడ్ పేరిట నేడు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రకోట పరిసరాల్లో ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, వాటిపై రైతులే దర్శనమిస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణలు జరిగాయి. అయితే ట్రాక్టర్లతో దూసుకొచ్చిన రైతుల ధాటికి పోలీసులు వెనుకంజ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతులు పెద్ద సంఖ్యలో ఐటీవో నుంచి ఎర్రకోట చేరుకున్నట్టు అర్థమవుతోంది.

More Telugu News