Boris Johnson: క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో భార‌త్ రాలేక‌పోయాను: యూకే ప్ర‌ధాని

  • భార‌త గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూకే ప్ర‌ధాని సందేశం
  • వైరస్ క‌ట్ట‌డి కోసం భారతదేశంతో కలిసి యూకే పనిచేస్తుంది
  • ఈ ఏడాది చివర్లో భారతదేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తా
Boris Johnson greets India on RDay says working together to eliminate Covid

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వ‌హిస్తున్న ప‌రేడ్‌కి ఈ సారి యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఆహ్వానించ‌గా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆయ‌న రాలేక‌పోయిన విష‌యం తెలిసిందే. ఈ రోజు భార‌త్ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌ వేడుక జ‌రుపుకుంటోన్న‌‌ నేప‌థ్యంలో ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలుపుతూ వీడియో సందేశం పంపారు. కరోనా వైరస్ క‌ట్ట‌డి కోసం భారతదేశంతో కలిసి యూకే పనిచేస్తుందని చెప్పారు.

అలాగే, వ్యాక్సిన్ సహకారంలో ఇరు దేశాలు క‌లిసి పనిచేస్తున్నాయని అన్నారు. త‌న‌ స్నేహితుడు ప్రధాన మంత్రి మోదీ ఆహ్వానం మేరకు భార‌తీయుల‌ను కలవాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని,  అయితే, క‌రోనా కార‌ణంగా తాను బ్రిట‌న్‌లోనే ఉండిపోయాన‌ని చెప్పారు.  వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి ఇరు దేశాలు చేస్తోన్న‌ సమష్టి కృషికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాను ఈ ఏడాది చివర్లో భారతదేశ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తాన‌ని అన్నారు. బ్రిటన్ లో భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రజలకు కూడా ఆయ‌న శుభాకాంక్షలు చెప్పారు.

More Telugu News