Bangladesh: భారత రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారి కదం తొక్కనున్న బంగ్లాదేశ్ ఆర్మీ

  • బంగ్లాదేశ్ స్వాత్రంత్యానికి 50 ఏళ్లు
  • 1971లో యుద్ధం
  •  భారత్ సాయంతో పాక్ నుంచి స్వాతంత్ర్యం పొందిన బంగ్లాదేశ్
  •  ఎర్రకోటపై పరేడ్ చేయనున్న బంగ్లాదేశ్ సైనికులు
Bangladesh army will parade in India Republic Day celebrations

భారత్ 72వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈసారి భారత గణతంత్ర దినోత్సవ సంబరాలకు ఓ ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ సైన్యం కూడా ఢిల్లీలోని ఎర్రకోటపై పరేడ్ లో పాల్గొంటోంది. అందుకు బలమైన కారణమే ఉంది. భారత్ సాయంతో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించి 50 ఏళ్లు కావొస్తోంది. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం ద్వారా బంగ్లాదేశ్ కు విమోచన లభించింది. అప్పటినుంచి భారత్ కు బంగ్లాదేశ్ మిత్రదేశంగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో, 122 మంది సైనికులతో కూడిన బంగ్లాదేశ్ బృందం భారత సైన్యంతో కలిసి కవాతు చేయనుంది. బంగ్లాదేశ్ త్రివిధ దళాలకు చెందిన ఈ బృందానికి మొహత్సిమ్ హైదర్ చౌదరి నాయకత్వం వహిస్తున్నారు.

ఓ విదేశీ సైన్యానికి భారత రిపబ్లిక్ డే పరేడ్ లో స్థానం కల్పించడం ఇది మూడోసారి. 2016లో ఫ్రాన్స్ సైన్యం, 2017లో యూఏఈ సైనికులు ఎర్రకోటపై భారత త్రివిధ దళాలతో కలిసి మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నారు.

More Telugu News