Pigs: తిరు మాడ వీధుల్లో సంచరించిన పందులు... అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు!

  • ఆలయం ముందుకు వచ్చిన వరాహాలు
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
  • తరిమేసేందుకు అధికారుల అవస్థ
Pigs in Tirumala Mada Streets videos viral

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయ మాడ వీధుల్లో పందుల గుంపు దర్జాగా సంచరిస్తూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 11 పందులు గొల్ల మండపం నుంచి మాఢ వీధుల్లోకి ప్రవేశించాయి. ఆపై తమ కిష్టం వచ్చినట్టుగా తిరుగాడాయి.

వీటిని గమనించిన విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమేసేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. అవి వెళ్లిపోయిన తరువాత, మాడ వీధుల్లోకి పందులు వస్తున్న మార్గాన్ని గుర్తించి, అక్కడ ఇనుప కంచెలను వేశారు. స్వామి ఆలయం అటవీ ప్రాంతం కావడంతో ఇలా పందులు రావడం సహజమేనని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం భక్తుల మనోభావాలను కాపాడటంలో టీటీడీ బోర్డు విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News