Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ!

  • మొదలైన సంక్రాంతి పర్వదినాలు
  • నిన్న దాదాపు 23 వేల మందికి దర్శనం
  • వారాంతంలో రద్దీ పెరిగే అవకాశం
No Rush in Tirumala

సంక్రాంతి పర్వదినాలు మొదలు కావడంతో తిరుమలలో రద్దీ భారీగా తగ్గింది. పండగ సీజన్ లో స్వస్థలాల్లో ఉండేందుకే అత్యధికులు మొగ్గుచూపుతూ, గ్రామాలకు చేరుకున్న వేళ, భక్తుల రద్దీ కనిపించలేదు.

ఈ క్రమంలో నిన్న స్వామివారిని సుమారు 23 వేల మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 2 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ మూడు రోజులూ రద్దీ సాధారణం కన్నా తక్కువగానే ఉంటుందని, ఆపై వారాంతంలో రద్దీ భారీగా పెరగవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మకర సంక్రమణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. తిరుమలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.

More Telugu News