KTR: జపాన్ సదస్సుకు తెలంగాణ మంత్రి కేటీఆర్

  • ఏప్రిల్ 5 నుంచి 7 వరకు టోక్యోలో ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ 
  • వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఆహ్వానం
  • ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంపై చర్చ
ktr to attend world technology forum

జపాన్ రాజధాని టోక్యోలో ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ‘ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్-2021’ సదస్సుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

కరోనా బారినపడి కుదేలైన ప్రపంచం తిరిగి అభివృద్ధిబాట పట్టేందుకు ‘ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగం’ అనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. గతేడాది స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దాదాపు 50కిపైగా సమావేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన 5 చర్చా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

More Telugu News