Allu Sirish: రెండు సార్లు టెస్టు చేయించుకున్నా.. నెగెటివ్ వచ్చింది: అల్లు శిరీశ్

  • నాకు రాలేదంటే ఆయుర్వేదంతో పాటు కొంత గుడ్ లక్ కూడా వుంది  
  • సంప్రదాయ నివారణ మార్గాలను మనం అనుసరించాలి
  • మన ముందుతరాలు వాడిన వాటిని మనం కూడా వాడాలి
Allu Sirish says he was tested twice and was negetive

మెగా హీరోల్లో రాంచరణ్, వరుణ్ తేజ్ కరోనా బారిన పడటం టాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మరో మెగా హీరో అల్లు శిరీశ్ తనకు కరోనా రాలేదని తెలిపాడు. రెండు సార్లు టెస్ట్ చేయించుకున్నానని... రెండు టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెప్పాడు.

అయితే ఓ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానని... ఇటీవలే తాను ఒక పెళ్లికి హాజరయ్యానని, అవుట్ డోర్ షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపాడు. షూటింగ్ లో ప్రతి రోజు దాదాపు 100 మందితో కలసి పని చేసేవాడినని చెప్పాడు. మాస్క్ ధరించేవాడినని, శానిటైజర్ వాడేవాడినని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపాడు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా సోకిన వ్యక్తికి కాంటాక్ట్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడు. అయినా తాను ఇప్పటికీ సురక్షితంగా ఉన్నానంటే దానికి ఆయుర్వేదంతో పాటు కొంత గుడ్ లక్ కూడా కారణమని భావిస్తున్నానని తెలిపాడు.  

వందేళ్ల క్రితం వరకు పాములు, గబ్బిలాలు, చిట్టెలుకల వంటి వాటితో కలిసి మనిషి జీవించాడని శిరీశ్ చెప్పాడు. వీటి వల్ల వచ్చే జబ్బుల నుంచి బయట పడేందుకు మన పూర్వీకులు మార్గాలను కనుక్కున్నారని తెలిపాడు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కులను ధరించడంతో పాటు మనకు అందుబాటులో ఉన్న సంప్రదాయ నివారణ మార్గాలను అనుసరించాలని చెప్పాడు.

ఆయుష్ క్వాత్, మృత్యుంజయ రసం, చ్యవన్ ప్రాశ్ వంటివి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని.. వాటిని మన ముందు తరాల వారు వాడారని తెలిపాడు. వీటిని వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పాడు. మన సనాతన ధర్మం, ఆయుర్వేదం వీటిని మనకు అందించాయని తెలిపాడు. అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించాడు.

More Telugu News