Monal Gajjar: 'అల్లుడు అదుర్స్'లో మోనాల్ కి ఛాన్స్!

  • మరాఠీ, గుజరాతీ సినిమాలలో మోనాల్ 
  • 'బిగ్ బాస్ 4' షోలో పాల్గొన్న ముద్దుగుమ్మ 
  • 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగులో ఛాన్స్  
  • హీరో హీరోయిన్లు కూడా పాల్గొనే పాట 
Monal Gajjar gets offer in Alludu Adursfilm

కొన్నాళ్ల క్రితం 'సుడిగాడు' సినిమాతో కథానాయికగా టాలీవుడ్ ప్రవేశం చేసిన మోనాల్ గజ్జర్, ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాలలో నటించింది. గ్లామర్ తారగా ఇక్కడ పేరుతెచ్చుకుంది. అదే సమయంలో కొత్త అమ్మాయిలు రావడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి. దాంతో మరాఠీ, గుజరాతీ సినిమాలపై దృష్టి పెట్టి అక్కడ కొన్ని సినిమాలలో నటించింది.

ఈ క్రమంలో ఇటీవల ప్రసారమైన 'బిగ్ బాస్ 4' రియాలిటీ షోలో ఈ చిన్నది ఒక్కసారిగా మెరిసింది. ఇందులో పార్టిసిపెంట్ గా పాల్గొని అందర్నీ ఆకట్టుకుంది. ఈ షో ఆమెకు మళ్లీ మంచి గుర్తింపును ఇచ్చింది. దాంతో మన దర్శక నిర్మాతల దృష్టిలో మోనాల్ మళ్లీ పడింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నదానికి టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్' సినిమాలో స్పెషల్ సాంగులో నటించే చాన్స్ మోనాల్ కు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ పాటకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉందట. హీరో సాయి శ్రీనివాస్, హీరోయిన్లు అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ తదితరులు పాల్గొనే ఈ పాటలో మోనాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని జనవరి 15న థియేటర్లలో విడుదల చేస్తారు.  

More Telugu News