Rashi Khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన రాశీఖన్నా 
  • సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీ
  • 'రొమాంటిక్'కి రామ్ వాయిస్ ఓవర్
  • ఆర్ఫీ పట్నాయక్ 'కాఫీ విత్ కిల్లర్'  
Rashi Khanna gives nod for web series

*  ఇప్పటికే పలువురు కథానాయికలు వెబ్ సీరీస్ లో నటిస్తున్న సంగతి మనకు తెలుసు. తాజాగా కథానాయిక రాశీఖన్నా కూడా ఓ వెబ్ సీరీస్ కి ఓకే చెప్పింది. రాజ్- డీకే ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో షాహిద్ కపూర్ తో కలసి రాశీఖన్నా నటించనుంది.
*  ఇటీవలే వివాహ నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ గాయని సునీత, రామ్ వీరపనేని కలసి మిత్రులకు ప్రీ వెడ్డింగ్ పార్టీని ఇస్తున్నారు. హైదరాబాదు, గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ వేదికగా ఈ రోజు సాయంకాలం 7.30కి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. వచ్చే నెలలో వీరు వివాహం చేసుకుంటున్నారు.
*  ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రొమాంటిక్' చిత్రానికి ఎనర్జిటిక్ హీరో రామ్ వాయిస్ ఓవర్ చెప్పాడు. కేతిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కలసి నిర్మిస్తున్నారు.
*  సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, దర్శకుడు అయిన ఆర్ఫీ పట్నాయక్ చాలా కాలం గ్యాప్ తర్వాత మరోసారి ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పేరు 'కాఫీ విత్ కిల్లర్'. ఈ చిత్రానికి నిర్మాత కూడ ఆయనే!

More Telugu News