teaser: ‘శ‌శి’ సినిమా టీజర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి

  • యంగ్ హీరో ఆది నటిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ శశి
  • ఆది పుట్టినరోజు సందర్భంగా విడుదల 
  • ఇష్టమైన పని, అవసరం కోసం పని చేయడానికి తేడా వుంటుందంటూ డైలాగ్
 teaser launch of Sashi

యంగ్ హీరో ఆది నటిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ 'శ‌శి' టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేతుల మీదుగా చిత్ర యూని 'శశి'  టీజర్‌ను విడుదల చేయించింది.  ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇందులో ఆది చెబుతోన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

‘మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే.. మొదటి క్షణాలు గుర్తుకొస్తాయ్’ అంటూ ఆయన చెబుతోన్న డైలాగుతో ఈ టీజర్ ప్రారంభం అవుతోంది. ఇష్టమైన పనిని చేయడానికి, అవసరం కోసం పని చేయడానికి చాలా తేడా ఉటుందంటూ హీరో డైలాగ్ చెప్పాడు. ‘మనకి నచ్చినట్టు మన లైఫ్ లేకపోతే మనకు ఈ లైఫ్ ఉండీ వేస్ట్’ అంటూ ఆయన మరో డైలాగు కూడా పలికాడు.

   

More Telugu News