Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'ఆచార్య' షూటింగ్ పూర్తి చేసిన కాజల్
  • 'ఎఫ్ 3' కోసం అధునాతన ఇంటి సెట్
  • 'కుడి ఎడమైతే' అంటున్న అమలాపాల్    
Kajal completes her shoot for Acharya

*  ఇటీవల 'ఆచార్య' షూటింగులో పాల్గొన్న కథానాయిక కాజల్ తన షూటింగును పూర్తిచేసుకుని ముంబై వెళ్లిపోయింది. ఈ షూటింగులో చిరంజీవి, కాజల్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. మళ్లీ వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగులో ఆమె పాల్గొంటుంది.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాదు శివారు కొండాపూర్ లో అధునాతన ఇంటి సెట్ ను వేస్తున్నారు. ఇందులో హీరో వెంకటేశ్ కి సంబంధించిన సన్నివేశాలను రెండు వారాల పాటు చిత్రీకరిస్తారట.
*  డస్కీ బ్యూటీ అమలాపాల్ తాజాగా 'ఆహా' ఓటీటీ ప్లేట్ ఫామ్ కోసం ఓ వెబ్ సీరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కుమార్ దర్శకత్వంలో 8 ఎపిసోడ్లుగా రూపొందుతున్న ఈ సీరీస్ కి 'కుడి ఎడమైతే' అనే టైటిల్ని నిర్ణయించారు.

More Telugu News