Tirumala: క్రమంగా పెరుగుతున్న తిరుమల భక్తులు... రూ. 3 కోట్లు దాటిన హుండీ ఆదాయం!

  • గతంతో పోలిస్తే ఇంకా సాధారణ స్థాయిలోనే రద్దీ
  • ఆదివారం నాడు 40 వేల మందికి పైగా దర్శనం
  • రూ. 3.13 కోట్లకు హుండీ ఆదాయం
Hundi Offerings in Tirumala Above 3 Crores

లాక్ డౌన్ తరువాత తెరచుకున్న తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే, రద్దీ సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ, కొండపైకి స్వామి దర్శనం నిమిత్తం వస్తున్న యాత్రికుల సంఖ్య పెరుగుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం నాడు శ్రీ వెంకటేశ్వరుని 40,721 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఇదే సమయంలో హుండీ ద్వారా వస్తున్న ఆదాయం కూడా రూ. 3 కోట్లను దాటింది. నిన్న హుండీ ద్వారా రూ. 3.13 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. 14,635 మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని, తిరుమల మొత్తాన్ని విద్యుద్దీపకాంతులతో అలంకరిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News