Virat Kohli: పింక్ బాల్ టెస్టు: ఎంతో పట్టుదలగా ఆడి చివరికి రనౌట్ గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ 

  • అడిలైడ్ లో భారత్, ఆసీస్ మధ్య డే/నైట్ టెస్టు
  • 80 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసిన భారత్
  • 74 పరుగులు చేసి అవుటైన కోహ్లీ
  • క్రీజులో రహానే, విహారి
  • ఇన్నింగ్స్ రెండో బంతికే వెనుదిరిగిన పృథ్వీ షా
  • రాణించిన పుజారా
Virat Kohli run out in Adelaide test

ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ డే/నైట్ టెస్టు మ్యాచ్ లో భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 80 ఓవర్ల అనంతరం 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల స్కోరుతో ఆడుతోంది. ఎంతో పట్టుదలతో ఆడి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశ కలిగించే రీతిలో రనౌట్ అయ్యాడు. రహానే పరుగుకు వస్తున్నాడని భావించి పిచ్ సగం వరకు వెళ్లిన కోహ్లీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. కోహ్లీ 180 బంతులాడి 8 ఫోర్లతో 74 పరుగులు చేశాడు.

అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా (0) తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ ఇన్నింగ్స్ రెండో బంతికే వెనుదిరిగాడు. ఈ వికెట్ మిచెల్ స్టార్క్ ఖాతాలోకి వెళ్లింది. అప్పటికి టీమిండియా పరుగుల ఖాతా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (17) ఫర్వాలేదనిపిస్తున్న తరుణంలో కమ్మిన్స్ బంతికి బౌల్డయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన పుజారా (43) ఓ మోస్తరుగా రాణించాడు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే (42), హనుమ విహారి (4) ఆడుతున్నారు.

More Telugu News