India: నిదానంగా సాగుతున్న ఇండియా బ్యాటింగ్... పుజారా, కోహ్లీలు నిలబడితేనే..!

  • 94 బంతులాడి 17 పరుగులు చేసిన పుజారా
  • అగర్వాల్ అవుటైన తరువాత వచ్చి చేరిన కోహ్లీ
  • 26 ఓవర్లలో 41/2
India Innings going Slow Pace

అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా డక్కౌట్ కాగా, ఆపై మయాంక్ అగర్వాల్ దాదాపు గంటన్నర పాటు క్రీజులో ఉండి, 40 బంతులను ఎదుర్కొని 17 పరుగులు చేసి కుమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆపై క్రీజులో ఉన్న ఛటేశ్వర్ పుజారాకు విరాట్ కోహ్లీ జత చేరగా, ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టే పనిలో పడ్డారు.

ఇండియా ఇన్నింగ్స్ ఓవర్ కు 1.57 రన్ రేట్ పై మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకూ భారత స్కోరు 26 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు కాగా, 22 బంతులాడిన కోహ్లీ 5 పరుగులతో, 94 బంతులాడిన పుజారా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక వీరిద్దరూ నిలబడి, మంచి స్కోర్ చేస్తేనే ఇండియా ఈ మ్యాచ్ లో నిలుస్తుంది.

More Telugu News