Tirumala: పెరిగిన చలి... తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

  • సాధారణ స్థాయితో తగ్గిన రద్దీ
  • మరో వారంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
  • వైకుంఠ దర్శనం కోసం భక్తుల పోటీ
No Rush in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయితో పోలిస్తే తక్కువగా ఉంది. చలి పెరగడం వల్ల తిరుమలకు వస్తున్న యాత్రికుల రాక మందగించిందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 20 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, వచ్చే వారం తరువాత రద్దీ అధికం కావచ్చని అంచనా వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన 2 లక్షల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అమ్ముడైపోయాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్ల వద్ద రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని టీటీడీ స్పష్టం చేయగా, ఆ టికెట్ల కోసం భక్తులు పోటీ పడుతున్నారు.


More Telugu News