Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • కొత్త ప్రాజక్టులకు ఓకే చెప్పిన అనుష్క 
  • ఫిబ్రవరి నుంచి డా.రాజశేఖర్ షూటింగ్
  • విజయ్ దేవరకొండ 'ఫైటర్' అప్ డేట్    
Anushka okays two new scripts

*  ఇటీవల అనుష్క నటించిన 'నిశ్శబ్దం' చిత్రం ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. అయితే, అంతగా ఆదరణ మాత్రం లభించలేదు. ఈ క్రమంలో తాజాగా రెండు కొత్త చిత్రాలకు అనుష్క ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. వచ్చే నెలలో ఈ చిత్రాల షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
*  డా.రాజశేఖర్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నందున ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మలయాళంలో వచ్చిన 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందుతుంది.  
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'ఫైటర్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ వచ్చే నెల నుంచి ముంబైలో జరుగుతుంది. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

More Telugu News