IYR Krishna Rao: ప్రజాస్వామ్య మనుగడకు సుప్రీంకోర్టు జడ్జిగారు ప్రస్తావించిన 2 అంశాలు ప్రధానమైనవి: ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు

  • ఎన్వీ రమణ వ్యాఖ్యలపై ఐవైఆర్ స్పందన
  • ఏ వ్యవస్థ అయినా అమలు చేసే వారి మీద ఆధారపడి ఉంటుంది
  • ప్రజాస్వామ్య మూలాలకు నిస్సందేహంగా అవినీతి పెద్ద చెద
iyr krishna rao slams ap govt

ప్రజాస్వామ్య మూలాల్ని అవినీతి నమిలేస్తోందని ఏషియన్ లా ఇన్‌స్టిట్యూట్ కాన్ఫరెన్స్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలను ఈనాడు దినపత్రికలో ప్రచురించారు. రాజ్యాంగం ఎంత బాగున్నప్పటికీ దాన్ని అమలు చేసే వారు చెడ్డవారైతే ఫలితాలు చెడుగానే ఉంటాయని ఆయన అన్నట్లు అందులో పేర్కొన్నారు. న్యాయమన్న పదానికి రాజ్యాంగంలో విస్తృతార్థం ఉందని చెప్పారు. ఈ కథనాన్ని పోస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తన అభిప్రాయాలను తెలిపారు.

‘ప్రజాస్వామ్య మనుగడకు సుప్రీం కోర్ట్ జడ్జిగారు ప్రస్తావించిన రెండు అంశాలు ప్రధానమైనవి. ఏ వ్యవస్థ అయినా దాని సమర్థత అమలు చేసే వారి మీద ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్య మూలాలకు నిస్సందేహంగా అవినీతి పెద్ద చెద’ అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.

More Telugu News