Andhra Pradesh: ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం.. పలువురు విద్యార్థులు, టీచర్లకు కరోనా

  • ఈ నెల 2న ప్రారంభమైన పాఠశాలలు
  • చిత్తూరు జిల్లాలో 120 మంది టీచర్లకు కరోనా
  • తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
Coronavirus cases found in many schools of AP

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 2 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో కరోనా పరీక్షలను నిర్వహించగా.. 10 మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు తేలింది.

దీంతో, వారందరినీ వెంటనే పాఠశాల నుంచి ఇంటికి పంపించేశారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 120 మంది టీచర్లకు కరోనా సోకింది. ఓ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం గంగలకుర్రు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

More Telugu News