Kedarnath: కేదార్ నాథ్ ను కమ్మేస్తున్న మంచు!

  • దేశంలో వాతావరణ మార్పులు
  • మంచులోనే స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు
  • రెండు అంగుళాల మేరకు మంచు
Kedarnath Coverd in Snow

హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం కేదార్ నాథ్, మంచు దుప్పటి కప్పేసుకుంటోంది. దేశంలో శీతాకాలం ప్రవేశించి, వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయనడానికి సంకేతంగా ఈ ఉదయం నుంచి కేదార్ నాథ్ చుట్టుపక్కలా భారీ ఎత్తున మంచు కురుస్తోంది.

అయితే, ఆలయం ఆరు నెలల పాటు మూసివేసేందుకు మరికొంత సమయం ఉండటంతో, భక్తులు ఆ చలి, మంచులోనే స్వామిని దర్శించుకుంటున్నారు. కేదార్ నాథ్ కు వెళ్లే దారిలో దాదాపు రెండు అంగుళాల మేరకు మంచు కూరుకుపోయింది. ఆలయం ఎదుట భక్తులు విశ్రమించేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు సైతం మంచుతో నిండిపోయాయి. అక్కడి భక్తులు మాత్రం ఈ మంచును చూసి మురిసిపోతున్నారు.

More Telugu News