Whatsapp: అనవసర నోటిఫికేషన్లకు శాశ్వతంగా చెక్... వాట్సాప్ లో కొత్త ఫీచర్

  • నోటిఫికేషన్లను ఇప్పటిదాకా పరిమితకాలానికే మ్యూట్ చేసే వీలు
  • ఇకపై పర్మినెంటుగా మ్యూట్ చేసే అవకాశం
  • ఆల్వేస్ పేరిట సరికొత్త ఆప్షన్ ను పొందుపరిచిన వాట్సాప్
 Whatsapp introduced new option to mute notifications permanently

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పటివరకు నోటిఫికేషన్లను 8 గంటలు, వారం, నెల, ఏడాది వరకు మాత్రమే మ్యూట్ చేసే సదుపాయం ఉండేది. వాట్సాప్ ఇప్పుడా ఆప్షన్ల జాబితాలో శాశ్వతంగా మ్యూట్ చేసే అవకాశాన్ని కూడా చేర్చింది. అంటే, అవసరంలేని నోటిఫికేషన్లను ఎప్పటికీ మ్యూట్ చేసేయొచ్చు. మళ్లీ మనం అన్ మ్యూట్ చేసేదాకా ఆ నోటిఫికేషన్లు మన జోలికి రావు. వాట్సాప్ లో ఈ సరికొత్త ఫీచర్ ను 'ఆల్వేస్' పేరిట అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇది వాట్సాప్ మొబైల్ లోనే కాకుండా, వాట్సాప్ వెబ్ లోనూ పొందుపరిచినట్టు సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్ కు సంబంధించిన ప్రయోగాత్మక బీటా వెర్షన్ ను వాట్సాప్ ఇంతకుముందే తీసుకువచ్చింది. దీనికి అత్యధికుల నుంచి సంతృప్తి వ్యక్తం కావడంతో తాజాగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ లో ఈ ఫీచర్ కనిపించకపోతే, వాట్సాప్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకుంటే సరి!

More Telugu News