Assam rifles: ఉగ్రవాదులతో పోరు.. అమరుడైన శ్రీకాకుళం జిల్లా జవాను బాబూరావు

  • అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఎదురు కాల్పులు
  • ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం
  • మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన బాబూరావు
Assam Rifles convoy ambushed in Arunachal Pradesh one jawan martyred

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాను బొంగు బాబూరావు (28) అమరుడయ్యాడు. వజ్రపుకొత్తూరుకు చెందిన బాబూరావు అసోం రైఫిల్స్‌లో పనిచేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం 1.40 గంటలకు బాబూరావు భౌతికకాయం విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ చేరుకోగా స్థానిక యువకులు అక్కడి నుంచి అక్కుపల్లి మీదుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా స్వగ్రామానికి తీసుకెళ్లారు.

నేటి ఉదయం సైనిక లాంఛనాలతో బాబూరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం కాగా, గత నెల చివరిలో విధుల్లో చేరేందుకు వెళ్లాడు. అక్కడ 21 రోజుల క్వారంటైన్ అనంతరం మూడు రోజుల క్రితమే విధుల్లో చేరాడు. అంతలోనే ఆయన అమరుడైన వార్త తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది.

More Telugu News