Singireddy Niranjan Reddy: దివ్యాంగుడికి త్రిచక్ర వాహనం కోసం తన జీతం నుంచి డబ్బులు ఇచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి

  • వనపర్తి జిల్లాలో దివ్యాంగుడికి మంత్రి సాయం
  • తన జీతం నుంచి రూ.30 వేలు ఇచ్చిన నిరంజన్ రెడ్డి
  • త్రిచక్ర వాహనం కొనుక్కున్న దివ్యాంగుడు
Telangana Minister Niranjan Reddy helps a handicapped person

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెద్దమనసు చాటుకున్నారు. ఓ దివ్యాంగుడి కుటుంబ పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన ఆయన తన జీతం డబ్బులు ఇచ్చారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లికి చెందిన కృష్ణయ్య ఓ దివ్యాంగుడు. ఆయనకు భార్య భారతమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కాల్షియం లోపం కారణంగా యువకుడిగా ఉన్నప్పుడు కృష్ణయ్య కాళ్లకు వైకల్యం సోకింది.

ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలా ఓ త్రిచక్ర వాహనం కొనుగోలు కోసం మంత్రి నిరంజన్ రెడ్డి తన జీతం నుంచి రూ.30 వేలు అందించారు. అంతేకాదు, కృష్ణయ్య నూతన త్రిచక్రవాహనంపై కూర్చుండగా, అతడి కుమార్తె నడుపుతున్న దృశ్యాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకల్యం అనేది మనుషులకేనని, మనసులకు కాదని, దివ్యాంగులు కూడా ఎవరికీ తక్కువ కాదని, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా ప్రోత్సహించాలని అన్నారు.

More Telugu News