Sandalwood: బెయిలు కోసం మరోమారు కోర్టును ఆశ్రయించిన నటి సంజన

  • డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజన 
  • బెయిలు పిటిషన్లను ఇప్పటికే రెండుసార్లు కొట్టేసిన కోర్టు
  • ఎఫ్ఐఆర్‌లో ఆమె పేరు లేదన్న సంజన న్యాయవాదులు
Sandalwood Actor Sanjana Galrani once again appealed for bail

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న నటి సంజన గల్రానీ తనకు బెయిలు ఇప్పించాలంటూ మరోమారు కోర్టును ఆశ్రయించింది. ఆమె పెట్టుకున్న బెయిలు పిటిషన్లను కోర్టు ఇప్పటికే రెండుసార్లు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

సీసీబీ, నార్కోటిక్ విభాగం అధికారులు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటికీ ఆమె పేరును ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించలేదని పిటిషన్‌లో పేర్కొన్న సంజన తరపు న్యాయవాదులు సీసీబీ, కాటన్‌పేట పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ కేసులో సంజనతోపాటు పాటు రాగిణి ద్వివేదీని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు పరప్పన అగ్రహారలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ నెల 23 వరకు వీరి కస్టడీని కోర్టు పొడిగించింది.

More Telugu News