Gujarath: కేసును విచారిస్తుంటే సిగరెట్ తాగిన గుజరాత్ న్యాయవాది.. సీరియస్ అయిన న్యాయమూర్తి!

  • గుజరాత్ హైకోర్టులో ఘటన
  • వర్చ్యువల్ విధానంలో కేసుల విచారణ
  • న్యాయవాది సిగరెట్ తాగుతుంటే చూసిన జడ్జి 
  • రూ. 10 వేల జరిమానా
Lawer Smoked during Case Hearing fined

న్యాయమూర్తి కేసును విచారిస్తున్న వేళ, సిగరెట్ తాగిన న్యాయవాదిపై రూ. 10 వేల జరిమానా పడింది. ఈ ఘటన గుజరాత్ హైకోర్టులో జరిగింది. వివరాల్లోకి వెళితే, కరోనా కారణంగా కేసు విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కేవలం వర్చ్యువల్ విధానంలో కేసులను విచారిస్తున్నారులే అన్న ఊదాసీనతలో హైకోర్టు న్యాయవాది జేవీ అజ్మెరా, తన కారులో కూర్చుని సిగరెట్ అంటించారు.

దీన్ని గమనించిన జస్టిస్ ఏఎస్ సుపెహియా, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అజ్మెరా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించారని తేల్చిన ఆయన రూ. 10 వేల జరిమానా విధించారు. ఈ ఘటన గత నెల 24న జరుగగా, తాజాగా, అజ్మేరా కోర్టుకు క్షమాపణలు చెప్పి, జరిమానా చెల్లించారు.

More Telugu News