Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • మరో రికార్డు కొట్టిన 'బుట్టబొమ్మ'
  • కులుమనాలి వెళుతున్న నాగార్జున
  • నిఖిల్ 'కార్తికేయ 2' షూటింగ్ అప్ డేట్  
Buttabomma song sets new record on You Tube

*  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఎంత హిట్టో, అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరించిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ హిట్టయింది. యూ ట్యూబ్ లో ఈ పాట ఇప్పటికి 400 మిలియన్లకు పైగా వ్యూస్ పొంది సరికొత్త రికార్డు కొట్టింది.  
*  అక్కినేని నాగార్జున కథానాయకుడుగా నూతన దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ త్వరలో కులుమనాలి ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ జరిగే భారీ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
*  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగును డిసెంబర్ నుంచి నిర్వహిస్తారు. ఇది కూడా సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.  

More Telugu News