EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల... 75.29 శాతం మంది ఉత్తీర్ణులు

  • ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • మొత్తం 89,734 మంతి ఉత్తీర్ణత
  • కరోనా వల్ల హాజరుకాని వారి కోసం ఈ నెల 8న మళ్లీ ఎంసెట్
Telangana EAMCET results released

తెలంగాణ ఎంసెట్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి. జేఎన్టీయూ-హెచ్ క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. 75.29 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో టాప్-10 ర్యాంకులన్నీ బాలురే కైవసం చేసుకున్నారు.

వారణాసి సాయితేజ ఎంసెట్ టాపర్ గా నిలిచాడు. యశ్వంత్ సాయి (2), టి.మణి వెంకటకృష్ణ (3), చాగరి కౌశల్ కుమార్ రెడ్డి (4), హార్దిక్ రాజ్ పాల్ (5), నాగెల్లి నితిన్ సాయి (6), కృష్ణ కమల్ (7), సాయివర్ధన్ (8), హర్షవర్ధన్ (9), వారణాసి వచన్ సిద్ధార్థ్ (10) టాప్-10లో ఉన్న మిగతా ర్యాంకర్లు.

ఈ ఏడాది ఎంసెట్ కు 1,43,326 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 1,19,183 మందే హాజరు కాగా, 89,734 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాని విద్యార్థుల కోసం ఈ నెల 8న ప్రత్యేక ఎంసెట్ నిర్వహిస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

More Telugu News