RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి ఈ 22న కొమరం భీమ్‌ టీజర్ వచ్చేస్తోంది... అధికారిక ప్రకటన

  • ట్విట్టర్ లో తెలిపిన ఆర్ఆర్ఆర్‌ టీమ్
  • కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియోపై ప్రకటన 
  • ప్రస్తుత షూటింగ్ ఏర్పాట్లపై వీడియో విడుదల  
RestedRaised fist RechargedFire Raring to goWater wave rrr

దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న సూపర్ హిట్‌ మూవీ 'బాహుబలి' తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమాలో యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండడంతో అసలుసిసలైన మల్టీస్టారర్‌ రుచిని ప్రేక్షకులు చూడనున్నారు.  

కరోనా వైరస్ విజృంభణ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఆరు నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగును రామోజీ ఫిలిం సిటీలో తిరిగి ప్రారంభించినట్లు తాజాగా వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ ఇస్తూ ఆ సినిమా యూనిట్ కీలక విషయం తెలిపింది.

'మీరు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోంచి ఓ విషయంపై అప్‌డేట్‌ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రానుంది' అని ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఈ రోజు ఉదయం పేర్కొంది. చెప్పినట్లుగానే ఆప్‌డేట్‌ గురించి వీడియో రూపంలో ప్రకటన చేసింది. ఈ సినిమాలోని భీమ్‌ పాత్రను పరిచయం చేస్తూ ఈ నెల 22న జూనియర్ ఎన్టీఆర్‌ టీజర్ ను విడుదల చేస్తామని తెలిపింది.

 భారీ బడ్జెట్‌తో రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలోంచి చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే విడుదల చేసిన భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ 22న విడుదల చేయనున్నారు.
     

More Telugu News