RGV: 'శివ' సినిమా విడుదలై 31 ఏళ్లవుతోన్న నేపథ్యంలో వర్కింగ్ స్టిల్ పోస్ట్ చేసిన వర్మ

  • 1989, అక్టోబరు 5న విడుదలైన సినిమా
  • నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వర్మ
  • సెట్స్‌లో నాగ్‌కి సీన్‌ వివరిస్తోన్న ఆర్జీవీ
Ram Gopal Varma  A moment from the sets of SHIVA

నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ విడుదలై నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1989, అక్టోబరు 5న ఈ సినిమా విడుదలైంది.  ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా దాని గురించి ఇప్పటికీ ప్రేక్షకులు చర్చించుకుంటూనే ఉంటారు.

రామ్‌ గోపాల్ వర్మ అంటే మొదట గుర్తు కొచ్చేది శివ సినిమానే. ఆ సినిమాలోని సీన్లు తదుపరి సినిమాలకు మార్గదర్శకం చేశాయి. సరికొత్త ట్రెండ్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా గురించి రామ్‌ గోపాల్ వర్మ అప్పుడప్పుడు ఫొటోలు కూడా షేర్ చేస్తుంటారు. ఈ సినిమాలో నాగార్జున, అమల, రఘువరన్, చిన్నా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై 31 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్మ.. ఈ సినిమా షూటింగ్ తీస్తోన్న సమయంలో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. సెట్స్‌లో నాగ్‌కి ఆర్జీవీ సీన్‌ గురించి వివరిస్తుండగా ఈ ఫొటో తీశారు.

More Telugu News