Indian Railways: రైలు ప్రయాణికులపై చార్జీల మోత.. భారీగా పెరగనున్న టికెట్ ధర!

  • వినియోగ రుసుం పేరుతో చార్జీల పెంపు
  • టికెట్ తరగతిని బట్టి రూ. 10 నుంచి రూ. 35 వరకు అదనపు భారం
  • అత్యాధునిక సౌకర్యాలు ఉన్న స్టేషన్లకు మాత్రమే పరిమితం
Indian railways to increase ticket charges

రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అయితే, ఇది అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు మాత్రమే పరిమితం కానుంది. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి ఈ పెరుగుదల ఉంటుంది. అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులపై గరిష్ఠంగా రూ. 35 వరకు పెంపు ఉండగా, కనిష్ఠంగా పది రూపాయల వరకు వినియోగ రుసుమును వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖ త్వరలో పంపనున్నట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం.

More Telugu News