Rhea Chakraborty: బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన రియా, షోవిక్

  • నేటితో ముగిసిన రియా, షోవిక్ కస్టడీ
  • కస్టడీని అక్టోబరు 6 వరకు పొడిగించిన స్థానిక కోర్టు
  • బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన రియా తరఫు న్యాయవాది
Rhea and her brother Showik files bail plea in Bombay High Court

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ కోణం ఉండడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఎన్సీబీ నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే.

వీరి జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియగా, స్థానిక న్యాయస్థానం ఆ కస్టడీని అక్టోబరు 6 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో రియా, షోవిక్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టులో వారి న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.

డ్రగ్స్ అభియోగాలపై రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు సెప్టెంబరు 9న అరెస్ట్ చేశారు. సుశాంత్ కు రియానే డ్రగ్స్ సమకూర్చినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ సిండికేట్ లో రియా చక్రవర్తి ఒక యాక్టివ్ మెంబర్ అని ఎన్సీబీ భావిస్తోంది. ఈ కేసులో వరుసగా మూడ్రోజుల పాటు రియాను ప్రశ్నించిన ఎన్సీబీ ఆపై ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది.

More Telugu News