Sunny Leone: మ‌రో ఖ‌రీదైన కారును కొనుగోలు చేసిన స‌న్నీలియోన్

  • ఫొటోను పోస్ట్ చేసిన స‌న్నీ
  • ఇట‌లీ కంపెనీ మ‌స‌రాటీకి చెందిన కారు
  • ఇప్ప‌టికే ఆమె వ‌ద్ద రెండు ఖ‌రీదైన కార్లు
sunny buys new car

బాలీవుడ్ శృంగార తార‌ స‌న్నీ లియోన్ మ‌రో ఖ‌రీదైన కారును కొనుక్కుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె త‌న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇట‌లీ కంపెనీ మ‌స‌రాటీ త‌యారు చేసే కార్లంటే ఆమెకు చాలా ఇష్టం.

ఎంత‌గా అంటే ఆ కంపెనీ కార్లు ఇప్ప‌టికే ఆమె వ‌ద్ద రెండు ఉన్నప్ప‌టికీ మ‌రొకటి కొనుక్కునేంత‌లా. ఇటీవ‌లే ఆమె 1.31 కోట్లు ఖ‌ర్చుచేసి తెలుపురంగు గిబ్లి కారును కొని దానితో ఫొటోలు దిగింది. దాని కంటే ముందు ఆమె వ‌ద్ద క్వాట్రాపోర్ట్‌, గిబ్లీ నిరిసిమో మోడ‌ల్ కార్లు ఉన్నాయి.

అమెరికాలో ఉన్న త‌న ఇంటి వ‌ద్ద‌కు ఈ కొత్త గిబ్లీ కారు డెలివ‌రీ అయ్యిందని ఆమె తెలిపింది. కాగా, 3.0 లీట‌ర్ ట్విన్ ట‌ర్బో వీ6 ఇంజిన్ తో గంటకు వంద కిలోమీట‌ర్ల వేగాన్ని కేవ‌లం 5.5 సెక‌న్ల‌లో అందుకునేంత పిక‌ప్ ఈ కారుకి ఉంటుంది.

More Telugu News