Kangana Ranaut: కంగన కార్యాలయాన్ని కూల్చేసిన ఘటనపై శరద్ పవార్ స్పందన!

  • కంగన భవనం కూల్చివేత నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు
  • కూల్చివేత నిర్ణయం బీఎంసీ అధికారులు తీసుకున్నదన్న పవార్
  • మహా ప్రభుత్వంతో దానికి సంబంధం లేదని వ్యాఖ్య
Sharad pawar responds on Kanganas office demolition

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. కూల్చివేయాలనే నిర్ణయం బీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయమని... ఆ నిర్ణయంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మరోవైపు కంగన కొన్న ఆ భవనం శరద్ పవార్ దేనంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

More Telugu News