Viral Videos: క‌ల‌యో.. యానిమేష‌న్ మాయో.. తన కంటిలో తానే కూర్చున్న యువ‌కుడి వీడియో వైర‌ల్!

  • ఇటీవ‌ల పోస్ట్ చేసిన   కెవిన్‌ పార్రే
  • ఆశ్చ‌ర్యపోతూ కామెంట్లు
  • ఎలా చేశావ‌ని అడుగుతున్న నెటిజన్లు
animator video goes viral

త‌న కంట్లో తానే కూర్చున్న‌ట్లు ఓ వ్య‌క్తి పోస్ట్ చేసిన ఓ వీడియో ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. గ్రాఫిక్స్ చేశావా? ఎలా చేశావ్? అద్భుతం అంటూ నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అత‌డి ప్ర‌తిభ‌కు ఫిదా అయిపోతున్నారు. కెవిన్‌ పార్రే అనే ఓ యానిమేటర్ ‌ తన కంటి పాపలో తానే కూర్చున్న‌ట్లు ఇలా మాయ చేశాడు.

ఇది ఎలా సాధ్య‌మైంద‌న్న విష‌యాన్ని మాత్రం ఆయ‌న వివ‌రించి చెప్ప‌లేదు. మొద‌ట కెమెరా ముందు భూత‌ద్దం పెట్టి, త‌న కంటిని చూపించాడు. ఓ కంట్లోనే తను కూర్చొని ఉన్న‌ట్లు మైమ‌ర‌పించేలా వీడియో తీసుకున్నాడు. ఇటువంటి వీడియో తీయ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.  
   




More Telugu News