YSRCP: వైసీపీ గుర్తింపు రద్దు పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ.. వైసీపీ, సీఈసీకి నోటీసుల జారీ

  • ఢిల్లీ హైకోర్టులో అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్
  • ఈ రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
Delhi high court issues notices to YCP and CEC

వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఏపీ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ రిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

వైసీపీని రద్దు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పేరును ఇతరులు వాడకుండా చూడాలని పిటిషన్ లో పేర్కొన్నారు. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీ, సీఈసీకి నోటీసులు జారీ చేసింది. అటు, రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణ నవంబరు 4కి వాయిదా వేసింది.

More Telugu News