Tollywood: 'బొమ్మ బ్లాక్‌ బస్టర్‌' ఫస్ట్ లుక్ విడుదల.. పోతురాజుగా నందు

  • నందు, రష్మీ గౌతమ్‌ జంటగా 'బొమ్మ బ్లాక్‌ బస్టర్‌' 
  • రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో సినిమా
  • దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్స్‌గా సినిమాలో నందు
bomma block boster first look release

నందు, రష్మీ గౌతమ్‌ జంటగా రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. విజయీభవ ఆర్ట్స్‌పై  ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో నందు పోతురాజుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా కనపడతాడని ఆ సినిమా యూనిట్‌ ప్రకటించింది. పాత్రకు తగ్గట్లుగానే నందు లుక్‌ ఉంది. ఆయన పుట్టిరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

More Telugu News