Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అక్టోబర్ ద్వితీయార్థం నుంచి 'రాధే శ్యామ్' షూటింగు 
  • హిందీలోకి ఎన్టీఆర్ హిట్ సినిమా డబ్బింగ్
  • నాని సరసన మరో నాయికగా అదితీరావు  
Radhe Shyam shooting to resume in October

*  ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ తదుపరి షెడ్యూలును అక్టోబర్ ద్వితీయార్థం నుంచి ప్రారంభించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  రెండేళ్ల క్రితం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం మంచి హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని హిందీ, కన్నడ భాషల్లోకి అనువదిస్తున్నారు. త్వరలోనే ఓ యూట్యూబ్ చానెల్ వీటిని స్ట్రీమింగ్ చేస్తుంది.
*  నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఓ హీరోయిన్ గా ఇప్పటికే సాయిపల్లవి ఎంపిక కాగా, మరో హీరోయిన్ పాత్రకు తాజాగా అదితీరావు హైదరిని ఎంపిక చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.    

More Telugu News