Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాగార్జున సినిమాలో సమంత గెస్ట్ రోల్ 
  • బాలయ్యకు కథ చెప్పనున్న ప్రముఖ రచయిత
  • వెబ్ సీరీస్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ
Samantha to play guest role in Nagarjuna movie

*  నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇప్పుడు 'బంగార్రాజు' పేరుతో సీక్వెల్ చేయనున్నాడు. నాగార్జున కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ లో సమంత నటించనున్నట్టు సమాచారం. ఈమె పాత్ర సెకండాఫ్ లో వస్తుందని అంటున్నారు.
*  ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బి.గోపాల్ దర్శకత్వంలో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. దీని కోసం ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఓ కథను సిద్ధం చేశాడట. త్వరలోనే బాలయ్యకు దీనిని వినిపించనున్నట్టు తెలుస్తోంది.
*  యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఓ వెబ్ సీరీస్ నిర్మాణంలో భాగస్వామి అవుతున్నాడు. దర్శకుడు సందీప్ వంగాతో కలసి ఓ వెబ్ సీరీస్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ పోషిస్తాడట.  

More Telugu News