UPSC: సివిల్స్-2019 ఫలితాలను వెల్లడించిన యూపీఎస్సీ... టాపర్ గా నిలిచిన ప్రదీప్ సింగ్

  • గత సెప్టెంబరులో సివిల్స్ పరీక్షలు
  • ఫిబ్రవరి నుంచి ఇంటర్వ్యూల నిర్వహణ 
  • వివిధ సర్వీసులకు మొత్తం 829 మంది అభ్యర్థుల ఎంపిక
UPSC releases civil services results

వివిధ సివిల్ సర్వీసులకు సంబంధించి నిర్వహించిన సివిల్స్-2019 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ఈ పరీక్షల్లో ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచారు. మహిళల్లో ప్రతిభా వర్మకు టాప్ ర్యాంకు దక్కింది. సివిల్స్-2019 నియామకపు పరీక్షల్లో మొత్తం 829 అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. సివిల్స్-2019 నియామకాలకు సంబంధించి గతేడాది సెప్టెంబరులో రాత పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా, 11 మంది అభ్యర్థుల ఫలితాలను విత్ హెల్డ్ లో ఉంచారు. ఇక, ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మే 31న జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్టోబరు 4కి వాయిదా వేశారు.

More Telugu News