Ayodhya Ram Mandir: 175 మంది ప్రముఖులు, 135 మంది సాధువులకు అయోధ్య భూమి పూజకు ఆహ్వానం

  • ఆగస్టు 5న రామ మందిరం భూమి పూజ
  • హాజరుకానున్న ప్రధాని మోదీ
  • పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నదుల నుంచి నీరు సేకరణ
All set for Ram Mandir Bhumi Poojan in Ayodhya

అయోధ్యలో రామ మందిరం నిర్మాణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లుండి అయోధ్యలో రామ మందిరం భూమి పూజ జరగనుండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. ఈ చారిత్రాత్మక భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, రామ జన్మభూమి న్యాస్ అధిపతి నృత్యగోపాల్ దాస్ ఈ క్రతువులో ప్రధాని మోదీతో కలిసి వేదికపై ఆసీనులు కానున్నారు.

మొత్తమ్మీద ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 175 మంది ప్రముఖులను, 135 మంది సాధువులను ఆహ్వానించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. కాగా, ఈ భూమి పూజ కోసం దేశంలోని వేలాది పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని, వంద నదుల నుంచి పుణ్యజలాలను సేకరించినట్టు వివరించింది.

More Telugu News