YS Vivekananda Reddy: వివేకా కుమార్తె సునీత సమక్షంలోనే ముగ్గురిని ప్రశ్నిస్తోన్న సీబీఐ అధికారులు

  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహం వేదికగా విచారణ
  • హాజరైన వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి
  • పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ హాజరు
cbi probe in ys viveka case

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ.. ఈ రోజు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహం వేదికగా విచారణ జరుపుతోంది. వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవితో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లా విచారణకు హాజరయ్యారు.

ఈ ముగ్గురునీ వివేకా కూతురు సునీత సమక్షంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సునీతను కూడా అధికారులు పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి గత ఏడాది మార్చి 15న ఉదయం మొదటిగా వివేకా ఇంటికి వెళ్లారు. ఆయన తలుపు తీసి చూడగా బాత్‌రూమ్‌లో వివేకా మృతదేహం కనపడింది. బెడ్‌రూమ్‌లో కృష్ణారెడ్డికి ఒక లేఖ కూడా దొరికింది. అయితే, దాన్ని ఆ రోజు సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదు. కృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు గతంలో అరెస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.

More Telugu News