IYR Krishna Rao: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకు పోయినట్టయింది: నిమ్మగడ్డ వ్యవహారంపై ఐవైఆర్ స్పందన

  • రాజ్యాంగ పరంగా అన్ని వ్యవస్థలకు పరిమితులు ఉంటాయి
  • పరిమితులు లేవనుకుంటే భంగపాటు తప్పదు
  • సీఎస్ కు కోర్టు ధిక్కరణ సమస్య తప్పింది
According to constitution there are limits for everything says IYR Krishna Rao

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరకు, ఎస్ఈసీగా మళ్లీ రమేశ్ కుమార్ నే నియమిస్తూ నిన్న అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ... గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకుపోయినట్టుందని అన్నారు. రాజ్యాంగ పరంగా అన్ని వ్యవస్థలకు పరిమితులు ఉంటాయని... ఆ పరిమితులు లేవు అనే భ్రమలో ప్రవర్తిస్తే భంగపాటు తప్పదని చెప్పారు. నిమ్మగడ్డను మళ్లీ నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చీఫ్ సెక్రటరీకి కోర్టు ధిక్కరణ సమస్య తప్పిందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

More Telugu News