Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • పూజ హెగ్డే చేతిలో మరో బిగ్ ఆఫర్ 
  • బన్నీ సినిమా రీమేక్ లో జాన్వీ  
  • తేజ సినిమాలో కేరళ బ్యూటీ
Pooja Hegde to play female lead in Akshay Kumar movie

*  ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా వున్న అందాలభామ పూజ హెగ్డే తాజాగా మరో హిందీ చిత్రాన్ని అంగీకరించింది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే చిత్రంలో పూజ కథానాయికగా నటించనుంది. దీనికి ఫర్హద్ సంజీ దర్శకత్వం వహిస్తారు.
*  అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠ పురములో' బ్లాక్ బస్టర్ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. హిందీ నేటివిటీకి తగ్గట్టుగా కథలో స్వల్ప మార్పులు చేస్తారు.
*  తేజ దర్శకత్వంలో 'అలువేలుమంగ వెంకటరమణ' పేరిట ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. గోపీచంద్ హీరోగా నటించే ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించనుంది. ఇక మరో కథానాయికగా కేరళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శిన్ ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News