Doctor Namratha: హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన డాక్టర్ నమ్రత

  • పిల్లల అక్రమ రవాణా కేసులో ఏ1 నిందితురాలు నమ్రత
  • నమ్రతతో పాటు మరో ఆరుగురికి రిమాండ్
  • విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులు
Dr Namratha files bail petition in high court

చిన్న పిల్లల అక్రమ రవాణా కేసులో ఏ1 నిందితురాలు డాక్టర్ పచ్చిపాల నమ్రత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, పిల్లల అక్రమ రవాణా కేసు విశాఖలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, పిల్లలను విక్రయించే ఒక ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని యూనివర్సల్ ఆసుపత్రి ముసుగులో పిల్లలను విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్ గుట్టును రట్టు చేశారు. పిల్లలను పోషించలేని తల్లిదండ్రులను ముందే గుర్తించి, వారికి డబ్బులు చెల్లించి చిన్నారులను కొనుగోలు చేసి, వారిని ఇతరులకు విక్రయించారనే ఆరోపణలతో డాక్టర్ నమ్రతతో పాటు మరో ఆరుగురిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. నిందితులంతా ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు.

More Telugu News