Gongadi Sunitha: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

  • కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధులు
  • సునీత వద్ద పనిచేసే ఇద్దరు సిబ్బందికి కూడా కరోనా
  • సునీత భర్త, మరికొందరికి కరోనా పరీక్షలు
Aleru MLA Gongadi Sunitha Infected to Corona Virus

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, ఈ మహమ్మారి బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1892 కేసులు నమోదయ్యాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఆందోళన కలిగించే స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకోగా తాజాగా, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకినట్టు తేలింది.

గత కొన్ని రోజులుగా ఆమె జలుబుతో బాధపడుతుండగా గురువారం హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. సునీత వద్ద పనిచేసే ఇద్దరు సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు తేలింది. దీంతో సునీత భర్త, టెస్కాబ్ వైస్ చైర్మన్ అయిన గొంగిడి మహేందర్‌రెడ్డితోపాటు మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది.

More Telugu News