RGV: నాగార్జున 'శివ' షూటింగ్‌ నాటి అరుదైన ఫొటోను పోస్ట్ చేసిన ఆర్జీవీ

  • నాగార్జునతో అప్పట్లో 'శివ' తీసిన వర్మ 
  • నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న ఆర్జీవీ
  • విలన్ రఘువరన్‌కు ఓ సీన్‌ను చెబుతున్న దర్శకుడు 
rgv shares shiva shooting pic

అక్కినేని నాగార్జునతో అప్పట్లో తీసిన సూపర్‌ హిట్ సినిమా 'శివ' షూటింగ్‌ నాటి ఓ అరుదైన ఫొటోను ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు. ఆ సినిమాతో దర్శకుడిగా వర్మకు ఎంతటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగార్జున కెరీర్‌లో ప్రేక్షకులు మర్చిపోలేని సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది.

ఆ సినిమా అనుభవాలను గుర్తు చేసుకుంటూ వర్మ ఈ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో విలన్ రఘువరన్‌కు ఓ సన్నివేశాన్ని వర్మ వివరిస్తున్నారు. ఆ సమయంలో ఈ ఫొటోను తీశారు. ఈ సినిమాలో విలన్ భవానీ పాత్రలో రఘువరన్ నటించిన తీరు ప్రేక్షకులను బాగా అలరించింది.

More Telugu News