Kadapa District: కడపలో దారుణం.. హత్య చేసి తలను టిఫిన్ బాక్స్‌లో పెట్టి పడేసిన వైనం

  • యర్రగుంట్లలో ఘటన
  • ఐసీఎల్ రిటైర్డ్‌ ఉద్యోగి వెంకట రమణయ్య దారుణ హత్య
  • గువ్వల చెరువు ఘాట్ వద్ద తల లభ్యం
  • నిందితుడి ఇంట్లో మొండాన్ని గుర్తించిన పోలీసులు
man kills in kadapa

కడపలో ఓ దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఇక్కడి యర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్‌ ఉద్యోగి వెంకట రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, కేసును ఛేదించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ ముసలయ్యే ఈ హత్య చేశాడని గుర్తించామని, ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

వెంకట రమణయ్యను హత్య చేసి ఆయన తలను ఓ టిఫిన్ బాక్సులో పెట్టి గువ్వల చెరువు ఘాట్ వద్ద దాన్ని ముసలయ్య లోయలో పడేసినట్లు పోలీసులు చెప్పారు. ఆయన ఇంట్లో వెంకట రమణయ్య మొండాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే తల వున్న టిఫిన్ బాక్స్ కూడా లభ్యమైందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

More Telugu News