Vijay Devarakonda: స్టయిల్ మార్చిన విజయ్ దేవరకొండ.. కొత్త లుక్ ఫొటోలు ఇవిగో!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విజయ్‌ దేవరకొండ
  • తన తండ్రి గురించి పలు వ్యాఖ్యలు
  • సామాజిక మాధ్యమాల్లో కొత్త లుక్‌ వైరల్
vijay devarakonda new look

పొడవాటి జుట్టు, పిల్లిగడ్డంతో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త లుక్‌లో కనపడుతున్నాడు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రి గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.
                   
తాను ఏ నిర్ణయం తీసుకున్నా, తప్పులు చేసినా,  పోరాడినా, నా వెంటే తాను ఉన్నానని తన తండ్రి  ధైర్యం చెప్పేవారని విజయ్ దేవర కొండ తెలిపాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఆ సినిమా కోసమే ఆయన తన లుక్‌ మార్చినట్లు సమాచారం. ఆయన కొత్త లుక్‌పై అభిమానులు తెగసంబర పడుతూ ట్వీట్లు చేస్తున్నారు.

More Telugu News