INX Media Case: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఊరట

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం
  • సీబీఐ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
  • బెయిలుపై ఉండగా మీడియాతో మాట్లాడొద్దన్న సుప్రీం కోర్టు
Supreme Court Dismisses CBI Challenge To P Chidambaram Bail

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిలుపై సీబీఐ వేసిన రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓపెన్ కోర్టులో రివ్యూ పిటిషన్‌ను విచారించాలంటూ సీబీఐ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. 74 ఏళ్ల చిదంబరం దేశం విడిచిపారిపోయే అవకాశాలున్నాయని, కాబట్టి బెయిలు ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు గతేడాది అక్టోబరులో బెయిలు మంజూరు చేసింది. అనంతరం అదే ఏడాది డిసెంబరులో ఈడీ కేసులోనూ సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది.

చిదంబరం దర్యాప్తులో పాల్గొంటున్నారని, మున్ముందు కూడా ఇలాగే దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిలుపై ఉండగా ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని ఆయనను ఆదేశించింది. అలాగే, విదేశాలకు వెళ్లకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదన్న షరతులపై బెయిలు మంజూరు చేసింది.

More Telugu News