KCR: గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్, మంత్రులు‌

  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుక
  • రెండు నిమిషాలపాటు మౌనం 
  • సిరిసిల్ల కలెక్టరేట్‌ వద్ద కేటీఆర్‌ జాతీయ పతాక ఆవిష్కరణ
  • ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లన్న కవిత 
kcr on telangana formation day

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం ప్రగతిభవన్‌ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌  అమరవీరులకు నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు.  

అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు తెలంగాణ భవన్‌లో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు అక్కడ జాతీయ జెండా ఎగురవేశారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ వద్ద మంత్రి కేటీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

'తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కేసీఆర్ గారి బాటలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం. ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లు. జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!' అంటూ కల్వకుంట్ల కవిత తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు.
 

More Telugu News