Camps: పీవోకేలో ఉగ్రశిబిరాలు, చొరబాటు స్థావరాలు నిండిపోయాయి: లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు

  • పీవోకేలోని 15 స్థావరాలు ఉగ్రవాదులతో నిండినట్టు వెల్లడి
  • వీరంతా చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని వివరణ
  • కశ్మీర్ లో శాంతిని పాక్ జీర్ణించుకోలేకపోతోందన్న జనరల్
Army says terror camps in POK full

భారత్ ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రోద్బలిత ఉగ్రమూకలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని జమ్మూకశ్మీర్ ద్వారా భారత్ లో చొరబడడం, ఆపై దేశంలో పలు ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించాలన్నది ఉగ్రవాదుల అజెండా. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ భగ్గవల్లి సోమశేఖర రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పీవోకేలోని ఉగ్ర శిక్షణ శిబిరాలు, చొరబాట్లకు ఉపకరించే స్థావరాలు అన్నీ ఉగ్రవాదులతో నిండిపోయి ఉన్నాయని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ సరిహద్దు వ్యాప్తంగా చొరబాట్లు ఉద్ధృతమయ్యే అవకాశముందని తెలిపారు. ఇటీవల కాలంలో అనేకమంది టెర్రరిస్టులు హతమయ్యారని, వారి స్థానాలను భర్తీ చేసేందుకు పాక్ వైపు నుంచి ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే యత్నాలు పెరగొచ్చని తెలిపారు.

పీవోకేలోని 15 స్థావరాలు ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్నాయని, అందులోని టెర్రరిస్టులంతా పాకిస్థాన్ సైన్యం సాయంతో భారత్ లోకి చొరబడేందుకు కాచుకుని ఉన్నారని కల్నల్ బీఎస్ రాజు వివరించారు. అయితే, కశ్మీర్ లో శాంతి నెలకొనడం, శాంతిభద్రతల పరిస్థితి మరింత మెరుగవడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.

More Telugu News